google

July 29, 2011

Online Jobs Search And Career


ఆన్‌లైన్‌లో కొలువుల మేళా!
వెబ్ ప్రపంచం విస్తరించింది. అన్‌లైన్ పాఠాలు అందుబాటులోకొస్తున్నాయి. కొలువుల మేళా కూడా కొత్త శోభను సంతరించుకుంది. కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించాలనుకున్నా... మరో ఉద్యోగంలోకి మారాలనుకున్నా... అన్నీ ఆన్‌లైన్‌లోనే చకచకా జరిగిపోతున్నాయి. జాబ్ మార్కెట్‌లోని విస్తృత అవకాశాలను అభ్యర్థుల ముంగిటకే చేరవేసేందుకు వేల కొద్దీ జాబ్‌పోర్టల్స్ వెలిశాయి. ప్రతిభ, నైపుణ్యాలకు తగిన కొలువులను ఎంచుకునేందుకు దన్నుగా నిలుస్తున్నాయి. రైట్ జాబ్స్... రైట్ కాండిడేట్స్, మేక్ యువర్ కెరీర్ లీప్, ఇట్స్ టైంటు షైన్ అంటూ భవితకు భరోసానిస్తున్నాయి. వాటి తీరుతెన్నులను చూద్దామా మరి!!

విస్తరిస్తున్న జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ, ఆసక్తి క లిగిన వారు అక్కడిక క్కడే ఆన్‌లైన్‌లోనే రెజ్యుమె పంపే వీలును కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల నియామకాల కోసం జాబ్‌పోర్టల్స్‌ను వినియోగించుకుంటున్నాయి.

తమ కంపెనీలోని రిక్రూట్‌మెంట్స్ వివరాలను పోర్టల్స్ సాయంతో భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు సేవలందించడానికి పలు జాబ్‌పోర్టల్స్ పోటీపడుతున్నాయి. విభిన్న రంగాల్లోని పలు కంపెనీల్లో నియామకాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నాయి. సైంటిస్ట్ నియామకాల నుంచి ఫ్రెషర్ వరకు అందరికీ అనువైన కొలువుల సమాచారాన్ని అందిస్తున్నాయి.

లక్షల సంఖ్యలో!
అర్హతలు, అభిరుచులకు తగిన కొలువుకోసం రోజూ లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు ఈ వెబ్‌పోర్టల్స్‌ను శోధిస్తున్నారు. చిన్నాచితక కంపెనీల నుంచి ప్రముఖ కంపెనీల వరకు తమ రిక్రూట్‌మెంట్ వివరాలను ఈ జాబ్‌పోర్టల్స్‌లో పొందుపరుస్తుండడమే ఇందుకు కారణం. కొన్ని కంపెనీలు పోర్టల్స్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను నేరుగా సంప్రదించి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

మొదటిసారిగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారితోపాటు కెరీర్ మధ్యలో జాబ్ మారాలనుకునేవారూ ఈ జాబ్‌పోర్టల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నౌకరీ డాట్ కామ్, టైమ్స్‌జాబ్ డాట్ కామ్, మాన్‌స్టర్ ఇండియా డాట్‌కామ్, నౌకరీహబ్ డాట్‌కామ్ తదితర జాబ్‌పోర్టల్స్ విప్రో, ఎల్ అండ్ టీ, డచ్చి బ్యాంక్, ఐబీఎమ్, టాటా మోటార్ వంటి అనేక కంపెనీల్లో ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటి కప్పుడు అప్‌డేట్ చేస్తూ లక్షల సంఖ్యలో అభ్యర్థులను ఆకట్టుకుంటున్నాయి.

దరఖాస్తు చేసుకోండిలా!
జాబ్‌పోర్టల్స్‌లో లాగిన్ అయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. జాబ్‌పోర్టల్‌లో లాగిన్ అయిన అభ్యర్థులు ముందుగా తమ పేరు, అర్హతలు, మెయిల్ ఐడీ తదితర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కసారి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారంటే ఆన్‌లైన్‌లో ఉద్యోగాల వివరాలను ఎప్పటికప్పడు మీ ఇన్‌బాక్స్‌కి పొందొచ్చు. మౌస్ క్లిక్‌లతోనే మీకు న చ్చిన జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలపై పక్కాగా ప్రిపేరవ్వాలి. దరఖాస్తు సమయంలో ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరి.

ఇంటర్నెట్ సౌకర్యం, అప్‌డేటెడ్ వెర్షన్ రెజ్యుమెను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని ప్రత్యేక ఉద్యోగాలకోసం కవర్‌లెటర్‌లను సైతం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ రెజ్యుమెలో మీ ప్రస్తుత చిరునామా సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. మీ విద్యాభ్యాసం, గతంలో పనిచేసిన వివరాలను పొందుపర్చాలి. ఒకవేళ మీరు పార్ట్‌టైం ఉద్యోగం కోసం దరఖాస్తుచేస్తున్నట్లయితే మీ పనివేళలు కూడా పేర్కొనడం మర్చిపోవద్దు. చివరగా రెజ్యుమెను మీ పేరుతో సేవ్ చేసుకోవాలి. కొన్ని వెబ్‌సైట్‌లు మీ రెజ్యుమెను మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచిస్తాయి.

సరిచూసుకోండి:
జాబ్‌పోర్టల్‌లేదా కంపెనీ వెబ్‌సైట్లలో మీరు దరఖాస్తును సబ్మిట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏవైనా తప్పులు ఉన్నట్ల గమనిస్తే వెంటనే సరిచేసుకోవాలి. టైపింగ్, గ్రామర్ తప్పులు లేకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌లో పేస్ట్ చేసి స్పెల్/ గ్రామర్ చెక్ ద్వారా సరిచూసుకోవాలి.

సెర్చ్ ఫర్ ఎ జాబ్:
జాబ్‌పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాక కేటగిరీల వారీగా మీకు కావలసిన ఉద్యోగావకాశాలను చూడొచ్చు. మీకు కావాల్సిన జాబ్స్‌ను కీవర్డ్స్, ప్రాంతం ఆధారంగా సెర్చ్‌కూడా చేయొచ్చు. నచ్చిన జాబ్‌కు ఎంచక్కా దరఖాస్తుచే సుకోవచ్చు.

ఆన్‌లైన్ పరీక్షలు:
కొన్ని కంపెనీలు ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తాయి. వీటిని అసెస్‌మెంట్ పరీక్షలు, ఎంప్లాయిమెంట్ పరీక్షలు, కెరీర్ టెస్ట్‌లంటారు. ఉద్యోగానికి సరిపోతారనే విషయంలో అవగాహనకోసం కంపెనీలు ఈ పరీక్షలను నిర్వహిస్తాయి. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా మీకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

రెజ్యూమ్ సర్వీస్: ప్రస్తుత పోటీ ప్రపంచ ంలో ప్రముఖ జాబ్ పోర్టల్స్ సరికొత్త బాధ్యతలను భుజానికెత్తుకున్నాయి. కంపెనీల్లో ఉద్యోగాల కోసం కేవలం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడమే కాకుండా కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను కూడా తీర్చిదిద్దుతున్నాయి. దీన్నే రెజ్యూమ్ సర్వీస్‌గా పిలుస్తారు.

ఈ సర్వీసును ఎంచుకున్న అభ్యర్థుల సమాచారంతో జాబ్‌మార్కెట్‌కు సరిపడేలా ప్రొఫెషనల్ రెజ్యుమె లేదా కరిక్యులం వైటేను రూపొందిస్తాయి. ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు కోరుకునేవారు అందుకు తగ్గట్లుగా రెజ్యూమె రూపొందించుకోవాలనుకుంటుండడంతో ఈ సర్వీసుకు ఆదరణ పెరుగుతోంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే జాబ్ పోర్టల్‌కు కొంత మొత్తం చెల్లించాల్సిందే.

జాబ్ ఫెయిర్స్: మరికొన్ని జాబ్ పోర్టల్స్ ఉద్యోగార్థుల సౌలభ్యంకోసం కంపెనీల సహకారంతో జాబ్ ఫెయిర్‌లనుకూడా నిర్వహిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి ప్రముఖ పట్టణాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీటితో అభ్యర్థులతోపాటు కంపెనీలు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి ఫెయిర్‌ల్లో ఉన్నత స్థాయి హెచ్‌ఆర్ నిపుణులు కూడా పాల్గొంటారు. తగిన అర్హతలున్న అభ్యర్థులను తక్షణమే నియమించుకోవడానికీ ఆసక్తి చూపుతున్నాయి.

ప్రొఫైల్ ఏదైనా:
మీరు ఎటువంటి జాబ్ కోసం ఎదురుచూస్తున్నా... మీ ప్రొఫైల్ ఎటువంటిదైనా దిగులు చెందాల్సిన అవసరం లేదు. జాబ్ పోర్టల్స్ మీకోసం తగినంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఉద్యోగాలు, జాబ్‌మార్కెట్ సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ ప్రొఫైల్ చూసి కూడా సంకోచించాల్సిన అవసరం లేదు.

మిమ్మల్ని సరైన కంపెనీలో, మీకు తగిన స్థాయిలో ఉద్యోగాన్ని అందించేందుకు జాబ్‌పోర్టల్స్ సిద్ధంగా ఉన్నాయి. స్క్రీనింగ్, ప్రొఫైలింగ్, షార్ట్‌లిస్టింగ్ తదితర దశల్లో అభ్యర్థులను ఎంపిక చేసి అద్భుత అవకాశాలను కల్పిస్తున్నాయి.

కెరీర్ గెడైన్స్: జాబ్ పోర్టల్స్ కేవలం ఉద్యోగార్థులకు అవకాశాలు చూపడంతోనే సరిపెట్టుకోవడం లేదు. వారిని జాబ్‌కు అన్ని విధాల తగినట్లుగా తీర్చిదిద్దే బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాయి. నిపుణులచే కెరీర్ గెడైన్స్‌కు సంబంధించిన ఆర్టికల్స్ రూపొందిస్తూ అభ్యర్థుల్లో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన స్కిల్స్ తదితర అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. జాబ్ మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా సిద్ధంచేస్తున్నాయి.

కంపెనీ వెబ్‌సైట్లలోనూ:
ఒకవేళ మీరు ప్రత్యేకంగా ఎంచుకున్న కంపెనీలో పనిచేయాలని భావిస్తే సదరు కంపెనీ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. సాధారణంగా వెబ్‌సైట్‌లోని కెరీర్స్ లేదా అబౌట్ అజ్ విభాగాల్లో కెరీర్ సమాచారాన్ని పొందుపరుస్తారు. అందులోని సూచనలను పాటిస్తూ మీరు ఎంచుకున్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు పనిచేయాలనుకునే కంపెనీపై సరైన అవగాహన ఉంటే కంపెనీ వెబ్‌సైట్ లో దరఖాస్తుచేసుకోవడం మంచిది. పార్ట్ టైం ఉద్యోగాలనుంచి టాప్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల వ రకు దరఖాస్తు చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లో కంపెనీ పేరుకు జాబ్స్‌ను కలిపి సెర్చ్ చేస్తే రిజల్ట్స్‌లో మీకు కావాల్సిన వివరాలు మొదటి ఫలితాల్లోనే కనిపిస్తాయి.

ప్రముఖ జాబ్‌పోర్టల్స్:
* www.naukri.com
* jobsearch.monsterindia.com
* www.timesjobs.com
* www.shine.com
* careers.yahoo.com

No comments:

Post a Comment