google

March 16, 2012

Best Choice Fo TET Unqualified Students First TET After DSC Exam


ముందు టెట్.. తర్వాతే డీఎస్సీ


* మే 31న ఉపాధ్యాయ అర్హత పరీక్ష
* ఆగస్టు 27, 28, 29ల్లో డీఎస్సీ పరీక్షలు
* మాధ్యమిక విద్యామంత్రి పార్థసారథి వెల్లడి

హైదరాబాద్: డీఎస్సీ-2012 రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్/జులైలో నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను మే 31న.. డీఎస్సీ రాతపరీక్షలను ఆగస్టు 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు 'టెట్'లో ఉత్తీర్ణత తప్పనిసరి చేసినందున అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. టెట్ ప్రకటనను ఈనెల 19న విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించిన అనంతరం గురువారం ఉదయం ఈ విషయాన్ని వెల్లడించిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి రాత్రి విలేఖరుల సమావేశంలో పరీక్షల ప్రణాళిక పట్టికను ప్రకటించారు. డీఎస్సీ రాత పరీక్షలను వాయిదా వేయాలంటూ అందిన విజ్ఞప్తుల మేరకు వీటి నిర్వహణలో మార్పులు చేశామని వివరించారు. డీఎస్సీ-2012లో ప్రకటించిన 21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇవికాకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మరో డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. డీఎస్సీ రాతపరీక్షలను వాయిదా వేసినందున ఈలోగా అర్హతలు పూర్తిచేసుకున్నవారికీ (బీఎడ్/డీఎడ్) అవకాశాన్ని కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో డీఎస్సీ రాత పరీక్షలోనే టెట్‌నూ కలిపి నిర్వహించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. దీనిపై క్షుణ్నంగా అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందన్నారు.
'టెట్' వివరాలివీ..
* ప్రకటన జారీ: మార్చి 19న
* రుసుముచెల్లింపు: మార్చి 21 నుంచి ఏప్రిల్ 11 వరకు
* సమాచార బులెటిన్ డౌన్‌లోడ్: మార్చి 21న
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: మార్చి 22 నుంచి ఏప్రిల్ 12 వరకు
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మార్చి 15 నుంచి
* రాతపరీక్ష తేదీ: మే 31
* పేపరు-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
* పేపరు-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
* ఫలితాల వెల్లడి: జూన్ 21న
మారిన డీఎస్సీ తేదీల క్రమం
* ఏపీఆన్‌లైన్ లేదా ఈసేవా ద్వారా ఫీజు చెల్లింపు గడువు జులై 12 వరకు పొడిగింపు.
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జులై 13వ వరకు కొనసాగుతుంది.
* ఆగస్టు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చు.
* పరీక్షలు ఆగస్టు 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.
* సెప్టెంబరు 28న ఫలితాల వెల్లడి
డీఎస్సీ-2012 ప్రకటన జారీ సమయంలో పేర్కొన్న ప్రకారం మే 2, 3, 4 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పుడు ఆ తేదీలను మార్చినందున అదే క్రమంలో పరీక్షలు జరిగే విషయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన జారీచేస్తామని విద్యాశాఖ సంచాలకులు శివశంకర్ వెల్లడించారు. గత తేదీల ప్రకారమైతే మొదటిరోజు ఎస్జీటీ, లాంగ్వేజి పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్.. రెండోరోజు స్కూల్ అసిస్టెంట్ సైన్స్, లాంగ్వేజెస్.. మూడోరోజు ఇతరులకు పరీక్షలు జరగాలి. అయితే ఆగస్టులో నిర్వహించనున్న పరీక్షల్లో ఈ క్రమంలో కాకుండా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డీఎస్సీ రాతపరీక్షల తేదీలు మారినందున ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించి దరఖాస్తు చేసిన వారు కూడా మళ్లీ టెట్ రాసే అవకాశం ఉంది. ఎందుకంటే టెట్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం తిరిగి రాసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఇలాంటి వారి కోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడున్నర నెలలకు పైగా దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. తొలుత ప్రకటించిన డీఎస్సీ రాతపరీక్షలు అనుసరించి అభ్యర్థులు ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ వస్తున్నారు. తాజా మార్పులతో వీరి సన్నద్ధతకు అవరోధం ఏర్పడింది. కొందరి ప్రణాళికలు తారుమారయ్యాయి.


No comments:

Post a Comment